Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న క్రిస్టియన్ మిచెల్ బెయిల్ పిటీషన్ విచారణ
న్యూఢిల్లీ : ఆగస్తావెస్ట్ల్యాండ్ స్కామ్ కేసులో నిందితుడు క్రిస్టియన్ మిచెల్ జెమ్స్ బెయిల్ పిటీషన్లను ఈ నెల 28న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. అగస్తావెస్ట్ల్యాండ్కు చెందిన 12 వివిఐపి హెలికాప్టర్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలులో చేసిన విషయంలో రూ. 3,600 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కొనుగోలులో క్రిస్టియన్ మిచెల్ జెమ్స్ మధ్యవర్తిగా ఉన్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మిచెల్‌పై సిబిఐ, ఇడి వేరువేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో దాఖలైన రెండు వేరువేరు బెయిల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ విచారణలో ఇడి, సిబిఐ తరుపున న్యాయవాది విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ విచారణలో పాల్గొనవల్సి ఉందని, ఆయన అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనికి కోర్టు అనుమతించింది.
2018 డిసెంబరులో దుబారు నుంచి మిచెల్ జెమ్స్‌ను తీసుకునివచ్చారు. ఆ తరువాత సిబిఐ, ఇడి అతన్ని అరెస్టు చేశాయి. ముందుగా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో మిచెల్ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటీషన్లపై స్పందించాలని ఈ ఏడాది మేలోనే సిబిఐ, ఇడిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కొనుగోలు కారణంగా భారత ఖజానాకు సుమారు రూ. 2666 కోట్లు నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపిస్తుంది. ఆగస్తావెస్ట్ల్యాండ్ నుంచి రూ 225 కోట్లు లంచాన్ని మిచెల్ అందుకున్నాడని ఇడి ఆరోపిస్తుంది. ఈ కేసులో మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హాష్కే, కార్లో గెరోసా కూడా ఉన్నారు. వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు విషయంపై 2010 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం- ఆగస్తావెస్ట్ల్యాండ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.