Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు పనితీరు మరింత సజావుగా, సాఫీగా సాగేందుకు వీలుగా నాలుగు అంశాలపై విచారణ చేపట్టేందుకు నాలుగు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో వెల్లడించారు. వచ్చేవారం నుంచి ఈ ప్రత్యేక బెంచ్‌లు విచారణ ప్రారంభిస్తాయని చెప్పారు. క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల అంశాలు, భూసేకరణ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ కేసులను ఈ ప్రత్యేక ధర్మాసనాలు విచారిస్తాయని తెలిపారు. భూసేకరణ వ్యవహారాలకు సంబంధించిన ధర్మాసనానికి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహిస్తారని సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.