Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్ ప్యానెల్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో మతస్వేచ్ఛకు, దానికి సంబంధించిన మానవ హక్కులకు ముప్పు ఉన్నదని యునైటెడ్ స్టేట్ ప్యానెల్ తెలిపింది. మైనారిటీలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వ విధానాల వైఫల్యంతో పాటు అనేక కారణాలతో ఈ పరిస్థితులు ఏర్పడినట్టు వివరించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ తయారు చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొనబడింది. ఇది మత స్వేచ్ఛ హక్కులను పర్యవేక్షించే అమెరికన్ ప్రభుత్వ స్వతంత్ర ఏజెన్సీ. ఈ విషయంలో వైట్ హౌస్‌కు సలహాలు ఇస్తుంది. మతస్వేచ్ఛ క్రమబద్ధమైన ఉల్లంఘనలు, దానిని సహించిన కారణంగా అమెరికా ప్రభుత్వం భారత్‌ను ''ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం''గా పేర్కొనాలంటూ ఏప్రిల్ నెల నుంచి చేస్తున్న తన ప్రతిపాదనను ప్యానెల్ పునరుద్ఘాటించింది. 2022లో జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో ప్రభుత్వాలు మత మార్పిడి, మతాంతర సంబంధాలు, గోహత్యను లక్ష్యంగా చేసుకునే విధానాలను ప్రోత్సహిచాయని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. ముఖ్యంగా, మతపరమైన మైనారిటీలు, వారి తరఫున వాదించేవారిని అణచివేసేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఫారీన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ చట్టాలను ప్యానెల్ ఉదహరించింది. 'బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలో నాయకులు భారత లౌకిక పునాదికి విరుద్ధంగా, భారత్‌లోని మతపరమైన మైనారిటీలకు తీవ్ర ప్రమాదంలో ఉన్న భారత్‌ను బహిరంగ హిందూ రాజ్యంగా స్థాపించాలని కోరుతూ మతవాద విధానాలను సమర్థించారు, స్థాపించారు, అమలు చేశారు'' అని కమిషన్ తెలిపింది.