Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్, మాణిక్యం, మరో ముగ్గురు ఇన్చార్జీలు హాజరు
న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పార్టీకి నేతల రాజీనామాలపై చర్చ జరుగుతోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతల విమర్శలు కూడా చర్చకు వచ్చాయి. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, మరో ముగ్గురు ఇన్చార్జులు కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్లు కలిసి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. పార్టీ రాజీనామా చేసిన నేతలు వెళ్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఈ అంశాలపైనే చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించారు. దీనిపై ఖర్గే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దానికి కొనసాగింపుగానే గురువారం కూడా కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు.