Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరుల ఆస్తులను ప్రయివేటు శక్తులకు విక్రయించడానికి కేంద్రం ప్రణాళికలు వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్)కు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి గాను ప్రయత్నాలు వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు గురువారం రిపోర్టులు వచ్చాయి. 2022-23లో రూ. 1,62,422 కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.33,422 కోట్ల ఆస్తులను విక్రయించింది. ఇందులో బొగ్గు శాఖలోని రూ.17,000 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రయివేటుకు కట్టబెట్టింది. నగదీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.