Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు రూ.542కోట్లు, ఏపీకి రూ.682కోట్లు,
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తంగా రూ.17వేల కోట్ల పరిహార నిధులను విడుదల చేసింది. 2022-23 ఏడాదిలో ఇంతవరకు మొత్తంగా రాష్ట్రాలకు రూ.1.15లక్షల కోట్ల జీఎస్టీ పరిహార నిధులను విడుదల చేసినట్టు వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రూ.542 కోట్లు,ఆంధ్రప్రదేశ్‌కు రూ.682 కోట్లు విడుదల చేసినట్లు ఆర్ధిక శాఖ ప్రకటించింది.