Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రత్యేక వివాహ చట్టం-1954 కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ సంపర్క వివాహాలను గుర్తించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్‌లు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎల్‌జీటీబిక్యూం కమ్యూనిటీలోని సభ్యులందరికీ లింగ గుర్తింపు, తమకు నచ్చిన వ్యక్తిని వివాసం చేసుకునే ప్రాథమిక హక్కు, గుర్తింపు కోరుతూ పార్థ్ పిరోజ్ మోహ్రౌత్రా, ఉదయ్ రాజ్ ఆనంద్‌లు అనే మరో జంట్ కూడా రెండో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది.దీని పై కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది.