Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడీపీలో 10 శాతం వాటా : ముఖ్యమంత్రి పినరయి
తిరువనంతపురం : కోవిడ్ విపత్తు నేపథ్యంలో చతికిలపడ్డ పర్యాటక రంగం కేరళలో మళ్లీ మునుపటి స్థాయిలకు పుంజుకుంటోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం వాటా పర్యాటక రంగానిదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తిరువనంతపురంలో గురువారం హయత్ రీజెన్సీ హౌటల్ ప్రారంభోత్సం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ వల్ల పర్యాటక రంగం తీవ్ర ప్రభావితమైందనీ, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మళ్లీ పుంజుకుందని ఆయన చెప్పారు. హయత్ హౌటల్ ప్రారంభించడం ఆతిథ్య రంగానికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈ ఏడాది టైమ్స్ మ్యాగజైన్ టాప్ 50 అత్యద్భుత పర్యాటక గమ్యస్థానాలు జాబితాలో కేరళ చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు. అలాగే వివాహ మహౌత్సవ వేడుకలకు కూడా కేరళ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ప్రతిపక్ష నేత విడి సతీషన్ తదితరులు పాల్గొన్నారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త ఎంఎ యూసుఫ్ అలీ మాట్లాడుతూ రూ.500 కోట్లతో 2023లో కోజికోడ్‌లోనూ ఒక హౌటల్ నిర్మిస్తామని తెలిపారు. తిరువనంతపురంలో ప్రారంభించిన హౌటల్‌ను రూ.600 కోట్లతో నిర్మించారు.