Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : 2021 అక్టోబర్ 31న లఖింపూర్ ఖేరీలో జరిగిన రైతుల హత్యకాండకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు, నిందితుడు ఆశిష్ మిశ్రాపై అభియోగాలు మోపాలని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఛార్జిషీట్ సమర్పించినప్పటికీ, అభియోగాల రూపకల్పనకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇంకా తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు నవంబర్ 29న ట్రయల్ కోర్టు ముందుకు వస్తుందని పేర్కొంటూ వారంలోగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఆశిష్ మిశ్రా తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ మిశ్రాపై నమోదైన ఎఫ్ఐఆర్ నివేదికలు సాక్షుల ఆధారంగానే ఉన్నాయనీ, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా కాదని వాదించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకొని అందులో ఏం తేడా ఉందని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.