Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలీజియాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు : సీజేఐ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా వంద శాతం పరిపూర్ణంగా లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తుల నియామకం కోసం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను ప్రత్యేకంగా చెప్పలేమన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని అమలు చేసే విశ్వాసపాత్రులైన సైనికులని కొలీజియంపై ఇటీవల వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానంగా చెప్పారు. కేవలం కొలీజియం వ్యవస్థను సంస్కరించడం, న్యాయమూర్తుల జీతాలు పెంచడం వల్ల మంచి అర్హత కలిగిన వ్యక్తులు బెంచ్‌లో చేరవచ్చనేదని చెప్పలేమని తెలిపారు. బదులుగా న్యాయవాదులు న్యాయమూర్తులుగా ధర్మాసనంలో చేరడం మనస్సాక్షి, ప్రజా సేవ పట్ల నిబద్ధతతో ఉండాలని పేర్కొన్నారు. యువ న్యాయవాదులను ఆకట్టుకునేలా న్యాయస్థానాన్ని వ్యవస్థగా మార్చాలని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు.