Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలు నగంగానైనా అందంగానే ఉంటారని వ్యాఖ్యలు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినమహిళా కమిషన్ : నోటీసులు జారీ
న్యూఢిల్లీ : యోగా, ఆయుర్వేదం పేరిట ప్రజల భావోద్వేగాలను సరుకుగా మార్చి రూ.వేలాది కోట్ల వ్యాపారం చేస్తున్న పతంజలి అధినేత రాందేవ్ బాబా తన కండకావరాన్ని మరోమారు ప్రదర్శించారు. మహిళలు దుస్తులు ధరించకుండా నగంగా వున్నా అందంగానే ఉంటారని బరితెగింపు వ్యాఖ్యలు చేశాడు. థానేలో ముంబయి మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 'మహిళలు చీరలో బాగుంటారు. సల్వార్ సూట్స్‌లోనూ బాగా కనిపిస్తారు. నా కళ్లతో అయితే వాళ్లు ఏమీ ధరించకపోయినా చాలా బాగుంటారు' అని రాందేవ్ నోరు జారారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సమక్షంలోనే అతను ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సహా పలువురు ప్రముఖ బిజెపి, సంఫ్‌ు పరివార్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాందేవ్ ఇంతటి తీవ్రమైన వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నా.. ఒక్కడంటే ఒక్క బిజెపి నేతా అభ్యంతరం చెప్పలేదు. మహిళల పట్ల బిజెపికి ఉన్న చులకన భావనకు ఈ ఘటనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
నిరసనల వెల్లువ
రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మహారాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ నీలం గోర్హే తీవ్రంగా ఖండించారు. రాందేవ్ వ్యాఖ్యలు దిగజారిన అతని మానసిక స్థితిని తెలియజేస్తోందని గోర్హే వ్యాఖ్యానించారు. రాందేవ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలీ ఛకాన్కర్ ఆయనకు నోటీసులు జారీ చేశారు.
క్షమాపణ చెప్పాలి
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.తక్షణమే రాందేవ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు.