Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సమయంలో తమ వద్ద గల పాత నోట్లను డిపాజిట్ చేయలేకపోయిన వారికి ఏదైనా పరిష్కార మార్గాన్ని ఆలోచించగలరా అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ని సుప్రీం కోర్టుకోరింది. నిజాయితీగానే వీరు తమ వద్ద గల మొత్తాలను ఆనాడు బ్యాంకుల్లో జమ చేయలేకపోయారని తేలిన వారి కేసుల్లోనే ఈ పరిష్కారం ఆలోచించాలని కోరింది. ఇటువంటి నిజాయితీ గల కేసులు కొన్ని వుంటాయి. ఒక వ్యక్తి ఆరుమాసాల పాటు కోమాలో వుండి తన వద్ద గల నోట్లను మార్చుకోలేకపోయింది. ఆమె పిల్లలకు ఆ నోట్ల గురించి తెలియదు. బహుశా లాకర్‌లో వుండి వుంటాయి. ఇటువంటి కేసుల్లో మీరు తప్పక ఒక పరిష్కార మార్గాన్ని సూచించాల్సి వుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ బి.ఆర్.గవారు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గ్రేస్ పీరియడ్ 2016 నవంబరు 9 నుండి డిసెంబరు 31 మధ్య గల సమయంలో పాత నోట్లు డిపాజిట్ చేయలేని వారి నుండి వచ్చిన దరఖాస్తులను ఆర్‌బీఐ తన విచక్షణతో స్వతంత్రంగా పరిశీలించి నిర్ధారించవచ్చని స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ (సెసేషన్ ఆఫ్ లైబల్టీస్) చట్టం లోని నాలుగవ సెక్షన్‌లో గల 2, 3 సబ్ సెక్షన్లను జస్టిస్ గవారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.