Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు 'టైమ్‌లైన్' పాటించాలని ఐసీఎంఆర్ ఆదేశం
న్యూఢిల్లీ : యాంటి బయాటిక్స్ వాడకం ఎలా ఉండాలన్నదాన్ని వైద్యులకు తెలుపుతూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) గైడ్‌లైన్స్ విడుదల చేసింది. తక్కువ గ్రేడ్ జ్వరం, శ్వాసనాళాల వాపు (వైరల్ బ్రాంకైటీస్)తో బాధపడుతున్న రోగులకు యాంటి బయాటిక్స్ వాడరాదని ఐసీఎంఆర్ సూచించింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న 'టైమ్‌లైన్'ను అనుసరించి యాంటి బయాటిక్స్ మందులు రోగులుకు రాయాలని పేర్కొన్నది. నిర్దిష్ట కాలపరమితి లేకుండా వాడరాదని వైద్యుల్ని హెచ్చరించింది. చర్మ వ్యాధులు, సున్నితమైన కణజాలం ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులకు ఐదురోజులకు మించి యాంటి బయాటిక్స్ వాడరాదని తెలిపింది. న్యుమోనియా బాధితులకు ఐదు రోజులు, హాస్పిటల్లో ఉండటం మూలాన సంక్రమించినట్టయితే 8 రోజులు వాడాలని తెలిపింది. జనవరి 1-డిసెంబర్ 31, 2021 మధ్య ఐసీఎంఆర్ ఒక సర్వే చేపట్టగా, భారతదేశంలో పెద్ద సంఖ్యలో రోగులు కార్బపెనెమ్ అనే ఔషధం వాడటం వల్ల ప్రయోజనం పొందలేరన్నది గుర్తించింది. కార్బపెనెమ్ అత్యంత శక్తివంతమైన యాంటి బయాటిక్. అయితే దీని వాడకం పెద్ద ఎత్తున ఉండటంతో, బ్యాక్టీరియా, వైరస్‌లో డ్రగ్ రెసిస్టెన్సీ ఏర్పడింది. దీంతో అందుబాటులోని ఉన్న మిగతా మందులేవీ పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ల చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చుతోంది. ఈ-కొలి బ్యాక్టీరియా చికిత్సలో వాడే 'ఇమైపెనెం' అనే ఔషధం డ్రగ్ రెసిస్టెన్సీ 2016లో 14శాతం ఉండగా, 2021నాటికి 36శాతానికి పెరిగింది.