Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నుంచి 18, కాంగ్రెస్ నుంచి 14 మంది మహిళలకు టికెట్లు
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మహిళా అభ్యర్థులకు సరైన ప్రాతినిథ్యం కల్పించలేదు. మొత్తం 182 స్థానాల్లో..బీజేపీ-18, కాంగ్రెస్-14, ఆప్-9, బీఎస్పీ-13, ఏఐఎంఐఎం-2 స్థానాల్లో మహిళలకు టికెట్లు ఇచ్చాయి. గుజరాత్ ఎన్నికల ఓటర్లలో మహిళలు సగం మంది ఉన్నారు. అయినప్పటికీ వారి ప్రాతినిథ్యానికి తగ్గట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలేవీ మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదని విమర్శలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 139 మంది మహిళా అభ్యర్థులు ఆయా నియోజికవర్గాల్లో పోటీలో నిలబడ్డారు. ఇందులో 56 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2017) 126 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి 12మంది, కాంగ్రెస్ నుంచి 10మంది మహిళలకు టికెట్లు దక్కాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగనున్నది.