Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి దక్కిన గౌరవం
- మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జీ20 కూటమికి నాయకత్వం వహించడం దేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందని అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 95వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ మాట్లాడారు. తెలంగాణ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్లకు చెందిన నేతన్న యెల్ది హరిప్రసాద్‌ను ప్రశంసించారు. ఆయన ప్రత్యేకంగా జీ20లోగోను మగ్గంపై నేసి తనకు పంపినట్టు వెల్లడించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. చేనేత గొప్పతనాన్ని అభినందించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించారు.
డిసెంబర్ 1 నుంచి మన దేశం జీ-20 కూటమికి నాయకత్వం వహించబోతుందని తెలిపారు. మరోవైపు జీ20 సభ్యదేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని మోడీ తెలిపారు. జీ-20 అధ్యక్ష పదవి మనకు గొప్ప అవకాశంగా వచ్చిందని, మనం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అన్నారు. విశ్వ కళ్యాణం, ప్రపంచ సంక్షేమంపైదృష్టి పెట్టాలని అన్నారు. శాంతి, ఐక్యత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి సవాళ్లకు భారతదేశం దగ్గర పరిష్కారాలున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తోందని అన్నారు. 'విక్రమ్-ఎస్' ప్రయోగంతో ప్రయివేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ప్రారంభమైందని, దేశంలో విశ్వాసంతో నిండిన కొత్త శకానికి ఇది నాందని అన్నారు. మరోవైపు డ్రోన్ల వినియోగం సైతం విస్తరిస్తోందని, హిమాచల్ ప్రదేశ్‌లోని కినోర్లో డ్రోన్ల ద్వారా ఆపిళ్లను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇండియన్ మ్యూజిక్ గ్రంథానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరొచ్చిందని తెలిపారు. భారతీయ సంగీత పరికరాలను అనేక దేశాల్లో విక్రయిస్తున్నారన్నారు.