Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచకులలో పది స్థానాల్లోనూ ఓటమి
- బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీ భార్య సుమన్ సైనీ ఓటమి
- ఇండిపెండెంట్లదే హవా
న్యూఢిల్లీ : హర్యానా జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచకులలోని మొత్తం పది స్థానాల్లోనూ ఓటమిపాలైంది. బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నయాబ్ సింగ్ సైనీ భార్య సుమన్ సైనీ కూడా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లదే హవా కొనసాగింది. హర్యానాలో నవంబర్ 22 నుంచి 25 వరకు 143 పంచాయతీ సమితులు, 22 జిల్లా పరిషత్‌లకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. భారీ ఎదురుదెబ్బతో రాష్ట్రంలోని అధికార బీజేపీ పంచకులలోని మొత్తం పది స్థానాలను కోల్పోయింది. ఉత్తర హర్యానా జిల్లాలు అంబాలా, కురుక్షేత్ర మరియు యమునా నగర్ జిల్లా పరిషత్ ల్లో కాంగ్రెస్ మద్దతు స్వతంత్ర అభ్యర్థులు, ఆప్ అభ్యర్థుల నుంచి అధికార బీజేపీ, జేజేపీ పార్టీలు పెద్ద షాక్‌ను ఎదుర్కొన్నాయి.
బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీ భార్య సుమన్ సైనీ కూడా అమాబాలా జిల్లాలోని వార్డు నంబర్ 4 నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. సుమన్ సైనీపై కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ దేవి 236 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిర్సాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నేత, ఎమ్మెల్యే అభరు చౌతాలా తనయుడు కరణ్ చౌతాలా 625 ఓట్ల తేడాతో జిల్లా పరిషత్ స్థానాన్ని గెలుచుకున్నారు. కర్నాల్ లో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు శివ కుమార్ 1,534 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పానిపట్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ ఆశు షేరా ఓడిపోయారు. ఆశు షేర్ హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) మాజీ ఛైర్మెన్ సత్యవాన్ షేరా భార్యకావటం విశేషం.
గురుగ్రామ్‌లో కూడా బీజేపీపై ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపొందారు. ఇక్కడ బీజేపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందగా, ఐదు స్థానల్లో స్వతంత్ర అభ్యర్థులకు గెలిచారు. సిర్సా జిల్లా పరిషత్ లో 24 స్థానాలకు గాను ఐఎన్ఎల్డి 10, ఆప్ 6, బీజేపీ 3, మెను బెనివాల్ మద్దతుతో నిలబడ్డ స్వతంత్రులు 2, కాంగ్రెస్ మద్దతుతో నిలబడ్డ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు, జేజేపీ మద్దతుతో నిలబడ్డ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.
జిందా జిల్లాలో 25 స్థానాలకు గాను ఆప్ ఒకటి గెలిచికోగా, 24 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. చర్కీ దాద్రీ జిల్లా పరిషత్ లో 11 మంది స్వతంత్రులే గెలిచారు. ఫరీదాబాద్ జిల్లా పరిషత్ లో పది మంది ఇండిపెండెంట్లే గెలిచారు. ఝజ్జర్ పంచాయతీలో జేజేపీ 2, బీజేపీ 2, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలిచికోగా, 13 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అంబాలాలో 15 స్థానలకు గానూ ఇండిపెండెంట్లు ఎనిమిది, ఆప్ మూడు, బీజేపీ, బీఎస్పీ చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. కురుక్షేత్ర జిల్లా పరిషత్‌లో 17 స్థానాలకు గానూ 13 ఇండిపెండెంట్లు గెలిపొందారు. మూడు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఆప్ గెలిచింది. యమునా నగర్ జిల్లా పరిషత్ లో 18 స్థానాలకు గానూ ఇండిపెండెంట్లు 6, బీజేపీ 6, బీఎస్పీ 4, ఆప్ 1, ఐఎన్ఎల్డి 1 గెలుచుకున్నాయి. యమునా నగర్లో కాంగ్రెస్ నేత షమీమ్ ఖాన్ 8,280 భారీ మెజార్టీతో గెలిపొందారు. పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టీ ఇండిపెండెంట్లు 95, బీజేపీ 58, కాంగ్రెస్ 26, జేజేపీ 14, ఐఎన్ఎల్డి 6, ఆప్ 6, బీఎస్పీ 5 గ్రామ పంచాయతీల్లో గెలిచాయి.