Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవలం 22 స్థానాల్లోనే గెలుపు
- రెండు జిల్లాల్లో ఖాతా సున్నా..
- కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలే
- స్వతంత్రులదే హవా
న్యూఢిల్లీ : హర్యానాల జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. 22 జిల్లా పరిషత్‌లలో411 స్థానాలు ఫలితాలు వెల్లడయ్యాయి. 142 పంచాయతీ సమితిల్లో 3081 స్థానాలకు 117 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2,964 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీకి నిరాశ కలిగిస్తే, ఐఎన్ఎల్డీ, ఆప్‌లకు రాజకీయ ఆయువుపట్టుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానాలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి రాజకీయ పునాది ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అధికార బీజేపీ, జేజేపీలకు షాక్ ఇచ్చిన ఎన్నికల ఫలితాల్లో 411 స్థానాలకు గాను బీజేపీకి కేవలం 22 మాత్రమే దక్కాయి. దాని మిత్రపక్షమైన రెండు స్థానాలే దక్కాయి. ఆప్‌కు 15, ఐఎన్ఎల్డీకి 14 స్థానాలు వచ్చాయి. ఇండిపెండె అభ్యర్థులు 357 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సగానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయలేదు. జాట్, కిసాన్ ఉద్యమంలో ఉన్న రైతు నాయకులు కూడా ఈసారి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వాదించారు. వివిధ ప్రాంతాల్లో జాట్, కిసాన్ ఉద్యమంలో పాల్గొన్న, నాయకత్వం వహించిన నేతలు గెలిచారు. పంచకుల, సిర్సా జిల్లాల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. అంబాలా వంటి మరికొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలతో అధికార బీజేపీ సరిపెట్టుకుంది. గురుగ్రాంలో నాలుగు స్థానాలతో బీజేపీ సరిపెట్టుకుంది.
సీనియర్లను తిరస్కరించిన ప్రజలు
పానిపట్ ప్రజలు అనుభవజ్ఞులైన జిల్లా మాజీ కౌన్సిలర్లను తిరస్కరించారు. ఇక్కడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అషు షేరా ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే మాజీ మంత్రి బిజేంద్ర కడియన్ సతీమణి సుశీలాదేవిని కూడా ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీ భార్య అంబాలా జిల్లా పరిషత్ వార్డ్ నంబర్ 4 నుంచి ఇండిపెండెంట్ చేతిలో ఓడిపోయారు.
ఇండిపెండెట్లకు బీజేపీ తాయిలాలు
పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తెప్పించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే అధికార బీజేపీ, జేజేపీ నేతలు స్వతంత్రులను సంప్రదిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పనిలో నిమగమయ్యారు. తద్వారా మరింత మంది స్వతంత్ర సభ్యులను తమవైపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా ఆఫర్ చేస్తున్నారు.