Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై దాఖలైన 27 పిటిషన్లపై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజనపై దాఖలైన వివిధ పిటిషన్లలో పిటిషనర్ల వినతి, వారు కోరుకుంటున్న ఉపశమనాలకు సంబంధించి సమగ్ర వివరాలను కూర్చి కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ మూడు రకాల పిటిషన్లు ఉన్నాయని, కొందరు విభజనను వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేయగా, మరికొందరు విభజన ప్రక్రియ సక్రమంగా లేదంటూ వేశారని, కొందరు విభజన హామీలు అమలు చేయాలని పిటిషన్లు వేశారని తెలిపారు. తమ పిటిషన్ విభజన హామీల అమలుకు సంబంధించినదన్నారు.