Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థు లకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై స్పందిం చాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. విద్యార్థులకు శానిటరీ న్యాప్కిన్లు ఇవ్వాలని కోరుతూ జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వరుణ్ ఠాకూర్ వాదిస్తూ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల సంవత్సరానికి 23 మిలియన్ల మంది బాలికలు పాఠశాల నుంచి తప్పుకుంటున్నారని పేర్కొ న్నారు. అనేక విద్యాసంస్థల్లో కనీస మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరింత పెరిగాయని వాదించారు. లేవనెత్తిన సమస్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో సహాయం చేయవలసిందిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మా సనం కోరింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్సియల్ పాఠశాలల్లో బాలికల ప్రత్యేక వాష్‌రూమ్‌లను ఏర్పాటును కూడా ఈ పిటిషన్లో పేర్కొంది. తదుపరి విచారణను 2023 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.