Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర: మహిళల వస్త్రధారణ పై రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై బాబా రాందేవ్‌కు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల కు స్పందించిన రాందేవ్ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియచేసినట్టు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రాందేవ్ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు. 'కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చా లన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమా పణలు తెలియజేస్తున్నా' అని రాందేవ్ బాబా ఆ నోటీసులకు సమాధాన మిచ్చారు. మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు అంటూ రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సైతం దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని రామ్‌దేవ్‌ని ట్విట్టర్ మాధ్యమంగా అడిగారు. 'మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమతా ఫడ్నవిస్ ఎదుట రామ్‌దేవ్ మహిళల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి. ఆయన ప్రసంగంతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి'' అని ట్వీట్ చేశారు.