Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శివసేన పేరు, గుర్తుపై నెలకొన్న వివాదాన్ని డిసెంబరు 12న భారత ఎన్నికల కమిషన్ విచారించనుంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ మంగళవారం వెల్లడించింది. శివసేన పేరు, బాణం, విల్లు గుర్తు కోసం ఉద్ధవ్ థాకరే గ్రూపు, ఏక్‌నాథ్ షిండే గ్రూపుల మధ్య వివాదర కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు గ్రూపులు తమ వాదనలకు సంబంధించి పత్రాలు, డాక్యుమెంట్లను డిసెంబరు 9 సాయంత్రం 5గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ మంగళవారం ఆదేశించింది. ఇటీవల జరిగిన అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శివసేన పేరు, గుర్తు ఉపయోగించుకోవడానికి రెండు గ్రూపులకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే.