Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్-మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు మలేషియాలోని క్లూయాంగ్‌లోని పులారులో ప్రారంభమయ్యాయి. 'హరిమౌ శక్తి 2022' పేరుతో ప్రారంభమైన ఈ విన్యాసాలు డిసెంబరు 12 వరకూ జరగనున్నాయి. భారత్-మలేషియా సైనిక దళాల మధ్య వార్షిక శిక్షణలో భాగంగా 2012 నుంచి ఈ సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. 'భారత సైన్యానికి చెందిన గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్, మలేషియా సైన్యానికి చెందిన రాయల్ మలరు రెజిమెంట్‌కు చెందిన పోరాట-అనుభవం కలిగిన సైనికులు ఈ ఏడాది వివిధ కార్యకలాపాల ప్రణాళిక తదితర అంశాల్లో ఆపరేషన్ల సమయంలో పొందిన అనుభవాలను పంచుకోవడానికి ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు' అని భారత్ తెలిపింది.