Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం ఒక వేదికపై కనిపించడం సంచలనం సృష్టించింది. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై మంగళవారం జైపూర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ హజరయ్యారు. ఈ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కలిసి కనిపించారు. అలాగే, గెహ్లాట్, సచిన్ పైలట్ ఇరువురూ కాంగ్రెస్ పార్టీకి ఆస్తులని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తరువాత ఇద్దరు నేతలూ ఒకే వేదికపై కనిపించడం విశేషం. గతవారం ఒక ఇంటర్వ్యూలో పైలట్‌ను 'ద్రోహి' అని గెహ్లాట్ విమర్శించారు. దీనికి పైలట్ కూడా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.