Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు ఉండాలి
- సుప్రీం కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ (కడప) నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తన తండ్రి హత్య కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీచేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడి ధర్మాసనం అక్టోబర్ 19న వాదనలు ముగించి, తీర్పును రిజర్వు చేసింది. దానికి సంబంధించిన తీర్పును మంగళవారం జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. వివేకానంద రెడ్డి కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తితో ఉన్నారని, వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.