Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి
- మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని సాగదీయొద్దని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలోని రాజకీయల్లో మార్పులు రావా లని చెప్పారు. మంగళవారం నాడిక్కడ ఆయన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. దేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, జీవన స్థితిగతుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం తో పదవీ విరమణ చేసిన తరువాత ఖాళీగా ఉండలేననీ, అందుకే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
అందుకు విద్య, మహిళ, రాజకీయ, భాష, సాంస్కృతిక, పర్యావరణం వంటి పది అంశాలను గుర్తించాననీ, వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడుతానని, తన అభిప్రాయం చెబుతాననీ, అయితే తాను రాజకీయాల్లో జోక్యం చేసుకోనని వెల్లడించారు. ఇటీవలి రాజకీయ నాయకులు వాడే పదజాలంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పదజాలాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.