Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : ప్రధాని మోడీని రావణుడితో పోలుస్తూ.. ఆయనకేమైనా వంద తలలున్నాయా అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని అయిన మోడీ తన విధులను మరిచిపోయి ప్రచారానికి ప్రాముఖ్యతనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా తన గురించే మాట్లాడుతున్నారని అన్నారు. ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటున్నారు.. ఆయన పేరుతో ఓట్లు అడుగుతున్నారు. ఎన్నిసార్లు ప్రధాని మోడీ ముఖం చూడాలి.. ఆయనకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా..? అంటూ ఖర్గే ప్రశ్నించారు. ''మున్సిపాలిటీ ఎన్నికలు అయినా.. కార్పొరేషన్ ఎన్నికలు అయినా.. లోక్‌సభ, పార్లమెంటు ఎన్నికలు అయినా సరే.. మోడీ పేరుతో ఓట్లు అడగడం నేను చూస్తూనే ఉన్నాను.. అభ్యర్థి పేరుతో ఓట్లు అడగండి.. మోడీ వచ్చి మున్సిపాలిటీకి పనిచేస్తారా? మీకు అవసరమైన సమయంలో మోడీ మీకు సహాయం చేస్తారా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ విరుచుకుపడుతోంది. ఖర్గే 'గుజరాత్ పుత్రుడిని అవమానిస్తున్నారు' అంటూ బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. గుజరాత్ ఎన్నికల్లో బిజెపిని తట్టుకోలేకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలాంటి నియంత్రణ లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ''మౌత్ కా సౌదాగర్'' (మరణాల వ్యాపారి), ''రావణ్'' అంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూనే ఉందని అన్నారు.