Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : గుజరాత్ తొలి దశ శాసనసభ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం సాగించాయి. వామపక్షాల అభ్యర్థులు ప్రజా సమస్యలను ఎజెండాగా చేసేలా తమ ప్రచారాన్ని నిర్వహించాయి. తొలి దశలో 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1న గురువారం నాడు పోలింగ్ జరగనుంది. మిగిలిన 93 స్థానాలకు డిసెంబరు 5న పోలింగ్ జరుగుతుంది.
తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్ - సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాలకు సంబంధించిన 89 శాసన సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లోనూ పోటీ పడుతుండగా, ఆమాద్మీ పార్టీ 88 స్తానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఆఖరు గడియలో సూరత్ తూర్పు స్థానం నుంచి ఆమాద్మీ పార్టీ నేత తన నామినేషన్ ఉపసంహరిం చుకున్నారు. దీంతో ఆప్ 88 స్తానాల్లోనే బరిలో ఉంది. మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ 57 స్తానాల్లోనూ, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 14 స్తానాల్లోనూ, సమాజ్ వాదీ పార్టీ 12 చోట్ల, సీపీఐ(ఎం) నాలుగు స్థానాల్లోనూ, సీపీఐ రెండు స్థానాల్లోనూ తొలి విడతలో పోటీ చేస్తున్నారు. వీరుగాక 339 మంది స్వతంత్ర అభ్యర్థలు పోటీ చేస్తున్నారు. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 718 మంది పురుషులు కాగా 70 మంది మహిళలు. గుజరాత్‌లో సాధారణంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ద్విముఖ పోరు ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. వామపక్షాలు సైతం ఈ సారి తమకు పట్టున్న కేంద్రాలపై ప్రధానంగా దృష్టి నిలిపాయి.