Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ప్రత్యామ్నాయ మీడియా సంస్థగా ఎదిగిన ఎన్‌డీటీవీ నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రమోటర్లు అయినా ప్రణరు రారు, రాధిక రారులు డైరెక్టర్ల హోదా నుంచి తప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు అందిస్తున్న ఈ ఛానల్‌లో ఇటీవల గౌతం అదానీ మెజారిటీ వాటాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీటీవీ ప్రమోటర్ అయిన ప్రణరు రారు దంపతులు ఛానల్ డైరెక్టర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆ ఛానల్‌లో వారిద్దరికి 32.26 శాతం వాటాలున్నాయి. అదానీ 55.18 శాతం వాటాలతో యాజమాన్య హక్కులను కలిగి ఉన్నారు. కొత్తగా సుదీప్త భట్టాచార్య, సంజరు పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను నూతన డైరెక్టర్లుగా అదానీ నియమించారు. ప్రణరు రారు దంపతులు తప్పుకోగానే.. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎన్‌డీటీవీ ట్విట్టర్ ఖాతాను అన్‌ఫాలో చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్‌డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని కేటీఆర్ ప్రశంసించారు. ఇకపై ఆ ఛానెల్ బీజేపీకి అనుకూలంగా మారనుందనే భావనను వ్యక్తం చేశారు.