Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శ్రీలంక నుండి వచ్చిన తమిళ శరణార్ధులకు వర్తించనందున పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షాపూరితమైన చట్టమని డీఎంకే బుధవారం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. రాజ్యాంగంలోని 14వ అధికరణ (సమానత్వ హక్కు), 21వ అధికరణ(జీవితం, స్వేచ్ఛలకు సంబంధించిన హక్కు)లను ఈ చట్టం ఉల్లంఘస్తోందని ప్రకటించాలని కోరుతూ డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్.ఎస్. భారతి అఫిడవిట్ సమర్పించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన 200కి పైగా వ్యక్తులు, సంస్థల్లో డీఎంకే కూడా ఒకటి. మత ఆధారిత వివక్షను ఈ చట్టం పెంపొందిస్తోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సిద్దాంతాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. పౌరసత్వం నిర్ణయించడానికి ఈ చట్టం మతాన్ని కొత్త ప్రాతిపదికగా పెట్టిందని డిఎంకె పేర్కొంది.