Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైసీపీ ఎంపీ మాగుంట, శరత్‌చంద్రారెడ్డి కూడా..
- ఈడీ 32 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడి
- సౌత్‌గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపణ
- మద్యం కుంభకోణాన్ని నియంత్రించింది కూడా వీరే..
- దర్యాప్తు వాంగ్మూలంలో ధ్రువీకరించిన అమిత్ అరోరా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు చేరింది. ఆమెతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరాను బుధవారం ఈడీ అరెస్టు చేసింది. రిమాండ్ రిపోర్టులో ఈ కీలక విషయాలను పొందుపరిచింది. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో మూడో పేజీలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత పేర్లు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందని, దీన్ని విజరునాయర్‌కు చేర్చారనీ, సౌత్‌గ్రూప్‌ను పై ముగ్గురూ నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ విషయాన్ని దర్యాప్తు వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. అందరి ఫోన్ నెంబర్లు, ఈఎంఐ నెంబర్లతో సహా అన్ని అంశాలను పొందిపరిచింది.
పది ఫోన్లు వాడిన కవిత
అమిత్ ఆరోరాతో సంభాషణలకు కల్వకుంట్ల కవిత పది ఫోన్లను ఉపయోగించి, మాట్లాడి, ధ్వంసం చేసినట్టు ఈడీ పేర్కొంది. అరోరాతో కవిత 6209999999 నెంబర్‌తో ఆరు ఫోన్లు, 8985699999 నెంబర్‌తో నాలుగు ఫోన్లు మాట్లాడినట్టు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి 7893512345 గల ఫోన్ నెంబరుతో సంభాషించాడనీ, అతను తొమ్మిది ఫోన్లు మార్చినట్టు తెలిపింది. అభిషేక్ రెడ్డి 9524567789 గల ఫోన్ నెంబరుతో సంభాషణ చేసి, ఐదు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. సజనా రెడ్డి 9000082888 గల ఫోన్ నెంబరుతో సంభాషణ చేసి, మూడు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. బుచ్చిబాబు గోరంట్ల 9849039635 గల ఫోన్ నెంబరుతో ఆరు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఢిల్లీ సీఎం పీఏ బిభవ్ కుమార్ సహా 36 మంది పేర్లను రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేరడంతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మరింత రాజకీయ దుమారం రేగనుంది.