Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కార్యకర్తలపై విరుచుకుపడిన కాషాయ మూకలు
- ఒకరు మృతి, పలువురికి తీవ్రగాయాలు
అగర్తల : త్రిపురలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. నాలుగున్నరేళ్ల నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ స్థానిక కార్యాలయాన్ని సిపిఎం తిరిగి ప్రారంభిస్తోందన్న అక్కసుతో అధికార పార్టీ గూండాలు మారణా యుధాలతో దాడులకు పాల్పడ్డారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలపైనా విరుచుకు పడ్డారు. సిపిఎం సభ్యుడు షాహిద్ మియా (65)ను దారుణంగా హత్య చేశారు. కాషాయ మూకలు సాగించిన ఈ హింసాకాండ సెపాహిజలా జిల్లా ఛరిలాంలో బుధవారం చోటు చేసుకుంది. 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా క్షీణిస్తూ వచ్చాయి. ప్రతిపక్షాలపై ప్రధానంగా సీపీఐ(ఎం) పైనా, వామ పక్షాలపైనా తీవ్ర అణిచివేత కొనసాగిస్తోంది. పట్టపగలే దాడులకు తెగబడుతోంది. పార్టీ కార్యాలయాలు, ప్రజాసంఘాల కార్యాలయాలను దౌర్జన్యంగా మూసివేయిస్తోంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో బీజేపీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఛరిలాంలో కూడా బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. ఇక్కడి సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్ని నాలుగున్నరేళ్ల క్రితం కాషాయ మూకలు బలవం తంగా మూసివేయించారు. బుధవారం నాడు సీపీఐ(ఎం) ఈ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభి స్తుండగా బీజేపీ అక్కసుతో దాడికి తెగబడింది. స్థానికంగా క్రియాశీలకంగా ఉండే సీపీఐ(ఎం) సభ్యుడు షాహిద్ మియాను హత్య చేశారు. మారణాయుధాలతో దాడులకు పాల్పడటంతో సీనియర్ నాయకులు, మాజీ ఆర్థిక మంత్రి, ఎమ్మెల్యే భానులాల్ సహాతో పాటు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
దుండగులపై కఠిన చర్యలకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
త్రిపురలో బీజేపీ సాగించిన దౌర్జన్యకాండను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. షాహిద్ మియాను హత్య చేయడంతో పాటు తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడిన దుండగులపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. త్రిపుర శాసనసభ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగాల్సివున్న నేపథ్యంలో అధికార యంత్రాం గాన్ని, పోలీసులను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురి చేసేందుకే అధికార పార్టీ ఇలాంటి దురాగతాలకు, దౌర్జన్యాలకు పాల్పడు తోందని సీపీఐ(ఎం) విమర్శించింది. రాష్ట్రంలో స్వేచ్ఛ యుతంగా, సజావుగా ఎన్నికలు జరగాలంటే తక్షణమే ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర హక్కులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరింది.