Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో వారి సమస్యలు చర్చకు రావు
న్యూఢిల్లీ : గుజరాత్లో వలస కూలీల దుస్థితి చాలా దారుణంగా ఉన్నది. వారికి ఓటు హక్కు ఉండదు. తద్వారా వారికి వాయిస్ (మాట్లాడే గొంతు) ఉండదు. 17 లక్షల మంది వలస కూలీలకు ఓటు హక్కు లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్ల నుంచి దాదాపు 30 నుంచి 40 ఏండ్ల కిందట గుజరాత్‌కు వలస వెళ్లి స్థిరపడిన వారికి ఓటు హక్కు లేదు. మోడీ సీఎంగా....బీజేపీ అధికారంలో ఉన్నప్పటినుంచి.. ఇప్పట ివరకూ వారి అతిగతి గురించి ఎవరూ ప్రాధాన్యత నివ్వటంలేదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్ష మంది, ఒడిశాకు చెందిన 2.5 లక్షల మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 3 లక్షల మంది, బీహార్‌కు చెందిన 2 లక్షల మంది ప్రజలతో సహా 17 లక్షల మంది వలస కూలీలు గుజరాత్లో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓటు హక్కు ఉంటే, మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ గుజరాత్ వలస కూలీలు ఓటు హక్కుకు నోచుకోలేదు. దీంతో మాట్లాడే హక్కుకు కూడా దూరంగా ఉన్నారు. వారి గురించి పట్టించుకునే నాథుడే లేడు. వారంతా వజ్రాలు, వస్త్ర పరిశ్రమల్లో పని చేస్తారు. ఆయా పరిశ్రమలకు వారు వెన్నెముకగా ఉన్నారు. ఇప్పటికీ, చాలా మందికి అక్కడ ఓటు లేదు. ఎవరూ వారి సమస్యలను ఎన్నికల్లో చర్చించరు. వారి సమస్యలు ప్రచారంలోకి రావు. పరిష్కారం కావు. సూరత్‌లోని ఆజీవిక బ్యూరోకు చెందిన సంజరు పటేల్ ఏడేండ్లుగా వస్త్ర కార్మికులు సమస్యలపై పని చేస్తున్నారు. వలస కార్మికులను రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు. వారికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మరిచిపోతారు. వలస కూలీలు సెగలు కక్కే వేడి గదుల్లో 12 గంటల పాటు పని చేస్తారు. వారికి సామాజిక, ఉద్యోగ భద్రత ఉండదు. పదేండ్ల నుంచి పనులు చేస్తున్నా.. మూడు, నాలుగు రోజులు పనికి సెలవు పెడితే, వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిపారు. వస్త్ర పరిశ్రమల్లో ప్రమాదాలు సర్వసాధారంగా ఉంటుంది. పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ పొలిటికల్ హెడ్జీకి చెందిన ధవల్ వాసన్ మాట్లాడుతూ సూరత్‌లో దాదాపు 40 వేల మంది ఒడిశా, 10 వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారని తెలిపారు. 1985లో ఒడిశా నుంచి గుజరాత్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వలస కూలీ బాలకృష్ణ రౌత్ మట్లాడుతూ తాము సరిపోని జీతం కోసం రోజుకు 12 గంటలు పాటు పని చేస్తామనీ, పని ప్రమాదకరమైనదనీ, ఎప్పుడైన తమను తొలగిస్తారని అన్నారు.మాలాంటి వలసబతుకులను ఏ పార్టీ పట్టించుకోదని కార్మికులు వాపోతున్నారు.