Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 700 దాటిన కేసుల సంఖ్య
ముంబయి : మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధిన బారిన పడి సంఖ్య 700కు పైగా చేరింది. ముఖ్యంగా ముంబయి నగరంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబయి నగరంలోనే 10 మంది మరణించారు. ముంబయి ప్రాంతంలో నవంబర్28 నాటికి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నాటికి కొత్తగా ముంబయిలో మరో 5మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ఒక అనుమానాస్పద మరణం చోటు చేసుకుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 717 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబయి నగరంలోనే 303 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తట్టు వ్యాధి వల్ల 14 మంది మరణిస్తే ఇందులో ఒక్కరు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్లు తేలింది. మరణించిన వారిలో నలుగురు 0-11 నెలల వయసు గల పిల్లలు ఉన్నారు. 8 మంది 12-24 నెలల వయసు ఉన్న వారు ఉన్నారు. అయితే ఇద్దరు 25-60 ఏళ్ల వయస్సు ఉన్న పెద్దవాళ్లు కూడా ఉన్నారు. పెరుగుతున్న కేసులు, మరణాల దృష్ట్యా ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.