Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంతో....
బెల్గావి : గత రెండు వారాలుగా కర్నాటక-మహారాష్ట్రల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఓ కాలేజీలో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థిపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో బెల్గావిలోని తిలక్వాడి ఇంటర్ కాలేజీలో ఓ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫెస్ట్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాంప్రదాయ కన్నడ (కర్నాటక) జెండాను ప్రదర్శించాడు. దీంతో ఆగ్రహించిన మహారాష్ట్ర విద్యార్థులు అతనిపై దాడికి దిగారు. ఇది ఇరువర్గాల విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను నిలువరించారని పోలీస్ చీఫ్ రవీంద్ర గడాడి తెలిపారు. భాష ఆధారిత పునర్వ్యవస్థీకరణలో బెల్గావి, కొన్ని ఇతర మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తప్పుగా కర్నాటకలో చేర్చారంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా ఈ వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దు వివాదం మహా రాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిందని కర్నాటక ముఖ్యమంత్రి బమ్మై వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీ కరణపై ఇన్ని సంవత్సరాల్లో ఏ సందర్భంలోనూ సమీక్ష చేపట్టలేదని, దీంతో మహారాష్ట్ర అభ్యర్థనలు చెల్లుబాటు కాలేదని అన్నారు. బమ్మై వ్యాఖ్యలను మహారాష్ట్ర నాయకత్వం ఖండిస్తోంది. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఇరు రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం. మరోవైపు కర్నాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయంగా లబ్థి పొందేందుకు బీజేపీ ఘర్షణలను రేకెత్తిస్తోందని రాజకీయ వేత్తలు వాదిస్తున్నారు.