Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహారాన్ని నిషేధించాలని కోరుతూ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రయివేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన లోక్‌సభ సభ్యుడు పర్వేష్ సాహిబ్ సింగ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ అనుమతి కోరారు. గ్లోబల్ వార్మింగ్, కర్బన ఉద్గారాల ప్రాతిపదికన జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇదే విధమైన బిల్లును ప్రవేశపెట్టిందని అందులో పేర్కొన్నారు. మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించడం బిల్లు ఉద్దేశం కాదనీ, కనీసం ప్రభుత్వ కార్యక్రమం నుంచి మినహాయించడమేనని ఎంపీ వాదిస్తున్నారు. ఇది స్థిరమైన ఆహారం, పర్యావరణ అనుకూల జీవన శైలికి దారి తీస్తుందని పేర్కొన్నారు. పౌరుల ఆహారపు అలవాట్లుపై కూడా నియంత్రణ లేదంటూ సంఫ్‌ు పరివార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ బిల్లు రావడం గమనార్హం. శీతాకాల సమావేశాల్లో వివిధ పార్టీల ఎంపిలు మొత్తం 20 ప్రయివేట్ బిల్లులు ప్రవేశపెట్టాలని అనుమతి కోరారు. స్వాతంత్య్రానంతరం మొత్తం 14 ప్రయివేట్ బిల్లులు ఆమోదించబడ్డాయి. చివరిది 1970లో ఆమోదించబడింది.