Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో గురు వారం బాలీవుడ్నటి స్వర భాస్కర్ పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి ప్రారంభమైన యాత్రలో ఆమె భాగమైనట్టు కాంగ్రెస్ పేర్కొంది. 'నేడు ప్రముఖ నటి స్వరభాస్కర్ భారత్ జోడోయాత్రలో భాగమయ్యారు. సమాజంలోని ప్రతి వర్గాలు పాలుపంచుకుంటూ ఈ యాత్రను విజయ వంతం చేస్తున్నారు' అని కాంగ్రెస్ ట్విటర్లో పేర్కొంది. బుధవారం విరామం అనంతరం ఈ యాత్ర గురువారం ఉజ్జయిని నుంచి ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని చివరిజిల్లా అగర్ మాల్వాకు చేరు కోనుంది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజాభట్, రియాసేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీ దేశారు, ఆకాంక్ష పూరీలు పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్ స్టార్ జాన్ కుసాక్ ట్విటర్లో మద్దతు తెలిపారు. డిసెంబర్ 4న ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది.