Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు, ఆమె భర్త అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. ఢిల్లీ కోర్టు విశ్లేషణకు అనుమతి ఇవ్వడంతో అఫ్తాబ్‌ను నార్కో పరీక్ష కోసం ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ పోలీసులు రోహిణిలో గల బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేముందు అఫ్తాబ్‌కు రక్తపోటు, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలను తనిఖీ చేసే సాధారణ పరీక్షలను నిర్వహించారు. అనంతరం అతను నార్కో పరీక్షకు అంగీకరిస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్‌కు అనస్తీషియా ఇచ్చారు. అనంతరం నార్కో పరీక్షను చేపట్టారు. ఫోటో నిపుణుడు, ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణుడు, ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు, నోడల్ ఆఫీసర్, నార్కో, అంబేద్కర్ హాస్పిటల్‌తో కూడిన ఎఫ్ఎస్ఎల్ అధికారుల బృందం నార్కో పరీక్షను నిర్వహించింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 11.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అతను వైద్యుల పరిశీలనలో ఉంచబడడంతో పాటు అతనికి మానసిక చికిత్స అందించారు. అఫ్తాబ్‌కు పూర్తి స్పృహ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసు బృందం అతడిని పూర్తి భద్రతతో తీహార్‌కు తీసుకెళ్లింది.