Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి నిబంధనలను ఉన్నత విద్య, బోధనా శాస్త్రంలో చేర్చాలి
- వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి
- విద్యా నిపుణుల సూచన
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం పలు డిమాం డ్‌లు వినిపిస్తున్నాయి. విలువలతో ఆద ర్శంగా నిలిచే ఉన్నత విద్యను పొందటం చాలా ముఖ్యమని విద్యావేత్తలు, నిపుణులు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మానవ హక్కులు చాలా ముఖ్య మైనవనీ, వీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇందులో భాగంగా మానవ హక్కుల నిబంధనలను ఉన్నత విద్యతో పాటు బోధనా శాస్త్రంలో చేర్చాల్సిన అవసరమున్నదని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మానవ హక్కులు కాలరాయబడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఈ హక్కుల ప్రాముఖ్యతపై సాధారణ ప్రజలలో అవ గాహన తక్కువన్నారు. ముఖ్యంగా, చదువుకున్న యువతలోనూ మానవ హక్కుల గురించి తెలిసింది తక్కువేనని నిపుణులు తెలిపారు. స్కూళ్లలో, కళాశాలల్లో, ఉన్నత విద్యనభ్యసించే సమయంలో మానవ హక్కుల ప్రస్తావన ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నారు. చదువుకున్న సమాజం మానవ హక్కుల ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు. విద్యపై అత్యంత ముఖ్యమైన ప్రపంచ పత్రం ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసీఈ ఎస్‌సీఆర్). దీనిని ఐక్యరాజ్య సమితి 1966లో ఆమోదించింది. భారత్ దీనిపై 1979లో సంతకం చేసింది. దీని ప్రకారం, విద్యకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రతి ఒక్కరికీ విద్యను పొందే హక్కును ప్రసాదించింది. విద్య మానవ వ్యక్తిత్వం పూర్తి వికాసానికి, దాని గౌరవం యొక్క భావాన్ని నిర్దేశిస్తుందన్న విషయాన్ని ఇది చెప్తుంది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని బలపరుస్తుందన్న విషయం ఇందులో ఉటంకించబడిందని విద్యావేత్తలు, నిపుణులు తెలిపారు. ఉన్నత విద్య వైపు మళ్లటం గురించి ఆర్టికల్ 2(సీ) వివరిస్తుంది. అన్ని స్థాయిలలో పాఠశాలల వ్యవస్థ అభివృద్ధిని చురుకుగా కొన సాగించాలని ఆర్టికల్ 2(ఈ) చెప్తుంది. బోధనా సిబ్బంది, భౌతిక పరిస్థితులు నిరంతరం మెరుగు పర్చటం గురించి ఇది వివరిస్తుంది. అయితే, ఉన్నత విద్య అనేది ఐసీఈఎస్‌సీఆర్ సిఫారసులకు విరు ద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నదని నిపుణులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో యునెస్కో ఎవాల్వింగ్ రైట్ టు ఎడ్యుకేషన్ సెమినార్‌కు కంట్రిబ్యూటర్‌లలో ఒకరైన క్లాస్ డి. బీటర్.. ఐసీ ఈఎస్‌సీఆర్ మానవ హక్కుల ఆధారిత దృష్టిని బలహానపరిచే ఉన్నత విద్యలోని కొన్ని పరిణామాలను జాబితా చేశారు. ప్రజావస్తువుల ప్రయివేటీకరణ, అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యత గురించి తెలియకపోవటం, వలసలు, ప్లూరలైజేషన్, 'ఇతరత్వం'ని అంగీకరించకపోవటం వంటి అంశాలను ఆయన లేవనెత్తారు. ఉన్నత విద్యలో సంస్కరణలు కేవలం సిఫారసుల రూపంలో కాకుండా అంతర్జాతీయ చట్టాల రూపంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండాలని ఆయన ప్రతిపాదించారు. ఉన్నత విద్య శాంతి నిర్వహణ కోసం ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలను మరింతగా కొనసాగించటానికి విద్యార్థులకు శిక్షణనిస్తుందని నిపుణులు చెప్పారు. 'ది హ్యూమన్ రైట్స్-బేస్డ్ అప్రో చ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ (2018)'లో జేన్ కోట్జ్ మాన్ తన వివరణాత్మక అధ్యయనంలో మార్కెట్ ఆధారిత సూత్రాలపై ఉన్నత విద్యా విధాన రూప కల్పనలో మానవ హక్కుల ప్రాముఖ్యతపై బలమైన వాదనను అందించారని తెలిపారు. మానవ హక్కు లకు భంగం వాటిల్లకుండా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలూ తమ వంతు పాత్రను పోషించాలని విద్యావేత్తలు, నిపుణులు చెప్పారు.