Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక వేధింపుల నిరోధకంపై సొంత పాలసీ
- పీవోఎస్‌హెచ్, 2013 చట్ట పరిధిని తగ్గించే ప్రయత్నం
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులపై ఫుడ్ డెలివరీ కంపెనీ 'స్విగ్గీ' ప్రకటించిన విధానం వివాదాస్పదమవుతోంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగికవేధింపులకు సంబంధించి అమల్లో ఉన్న 'పీవోఎస్‌హెచ్-2013' చట్ట పరిధిని పరిమితం చేస్తూ స్వంత విధానాన్ని స్విగ్గీ ప్రకటించిందని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. లైంగిక వేధింపుల నిర్వచనం, ఫిర్యాదు, విచారణ, కమిటీ నివేదిక..మొదలైన వాటిపై స్విగ్గీ తనదైన నిర్వచనం, విధానాన్ని రూపొందిం చింది. బాధిత మహిళా ఉద్యోగులకు ఎలాంటి న్యాయమపరమైన సహకారం, మద్దతు ఉంటుందన్నది స్విగ్గీ అంతర్గత విధానంలో స్పష్టం చేయలేదు. ఉబర్, ఓలా, జొమాటా, ఉర్బాన్..మొదలైనవి కూడా స్విగ్గీని అనుసరించే ప్రమాదముందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్విగ్గీలో పనిచేసే మహిళా డెలివరీ ఉద్యోగుల్ని ప్లాట్‌ఫాం వర్కర్స్‌గా పేర్కొంటోంది. లైంగిక వేధింపులపై కంపెనీ విడుదల చేసిన స్వంత పాలసీ 'ప్లాట్‌ఫాం వర్కర్స్'కు వర్తించదు. కేవలం స్విగ్గీ మహిళా ఉద్యోగులకు మాత్రమే లైంగిక వేధింపుల నిరోధక విధానం వర్తిస్తుందని అర్థమవుతోంది. అయితే ప్లాట్‌ఫాం వర్కర్స్‌గా పనిచేస్తున్న వేలాది మంది మహిళలకు పాలసీ లేదా చట్టం వర్తించకుండా చేయటమేంటన్న ప్రశ్న న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. రెస్టారెంట్ నిర్వాహకులు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన పురుషుల నుంచి లైంగిక వేధింపులు ఎదురైతే..అప్పుడు డెలివరీ పార్ట్‌నర్‌గా స్విగ్గీలో పనిచేస్తున్న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించాల్సిందేనని, ఇక్కడ జరిగేదానికి తమ కంపెనీకి ఎటువంటి సంబంధమూ లేదని తన పాలసీలో స్విగ్గీ పేర్కొన్నది. స్విగ్గీలో వినియోగదారుడి నుంచి లైంగికవేధింపులు ఎదురైతే తీసుకొనే చర్య ఏంటన్నది కూడా తన పాలసీలో వెల్లడించింది. కేవలం ఆ వినియోగదారుడి పేరు తొలగించటం తప్ప మరోటి లేదు.