Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ కక్ష : ముఖ్యమంత్రి భూపేష్
రాయ్‌పూర్ :ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉన్నతాధికారిపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్యా చౌరాసియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాజధాని రారుపూర్‌లో గతేడాది జూన్‌లో జరిపిన సోదాల్లో రూ.100 కోట్ల హవాలా కుంభకోణం బయటపడిందని ఐటీ శాఖ తెలిపింది. నగదు చేతులు మారిందని, ఈ నగదుకి సంబంధించిన వివరాలు బ్యాంకులో నమోదు కాలేదని తెలిపింది. 2020 ఫిబ్రవరిలో సౌమ్యా చౌరాసియా నివాసంలో కూడా సోదాలు జరిపింది. కాగా, ఈడీ చర్యను రాజకీయ కక్షగా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం యత్నిస్తోందని ధ్వజమెత్తారు.