Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ నార్త్ కేంపస్ ప్రాంతంలో ప్రచారం చేస్తుం డగా, ఏబీవీపీ సభ్యులు తమపై దాడి చేశారని దాదాపు 36సంఘాల సంయుక్త వేదిక 'కేంపైన్ అగైనెస్ట్ స్టేట్ రిప్రెషన్' సభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రాళ్లు, లాఠీలు, ఇనుప రాడ్లతో వారు దాడి చేశారనీ, ఐదుగురు సభ్యులు గాయపడ్డారని చెప్పారు. భగత్ సింగ్ ఛత్ర ఏక్తా మంచ్కి చెందిన విద్యార్థి కార్యకర్త సంగీత మీడియాతో మాట్లాడుతూ, మారిస్ నగర్ పోలీసు స్టేషన్ ఏరియాలో ప్రచారం చేస్తూ, పాటలు పాడుతుండగా, ఇద్దరు వ్యక్తులు తమ వద్దకు వచ్చారని చెప్పారు. ఆ తర్వాత వారు ఫోన్లు చేయగా, కొందరు మహిళలు సహా 70 మంది వరకూ వచ్చారని తెలిపారు. దాదాపు 15 మందిపై దాడి జరిగిందన్నారు.