Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమాజీమంత్రిని 9లోగా అరెస్టు చేసి హాజరుపర్చండి
- స్వామి చిన్మయానంద సరస్వతి కేసులో కోర్టు ఆదేశాలు
షాజహాన్‌పూర్ : కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద సరస్వతిని అరెస్టు చేసి 9వతేదీలోగా తమ ముందు హాజరుపరచాల్సిందిగా ప్రత్యేక ఎంపీ-ఎంఎల్‌ఎ కోర్టు పోలీసులను ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఆయన హాజరు కాకపోవడంతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనను లైంగిక దోపిడీకి గురి చేశారంటూ ఆయన శిష్యురాలు ఒకరు ఇక్కడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చిన్మయానందపై అరెస్టు వారంటు జారీ అయిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది నీలిమా సక్సేనా తెలిపారు. అయితే ముందస్తు బెయిల్ కోసం చిన్మయానంద దరఖాస్తు చేసుకున్నారని, దానిపై 6వ తేదీన విచారణ జరగనుందని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అందువల్ల కోర్టు ముందు హాజరు కావడానికి ఆయనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ న్యాయమూర్తి అస్మా సుల్తానా తిరస్కరించారని నీలిమా సక్సేనా తెలిపారు. నవంబరు 30లోగా లొంగిపోవాల్సిందిగా సుప్రీం కోర్టు చిన్మయానందకి గడువు ఇచ్చిందని, కానీ ఆయన ఆలా చేయలేదని న్యాయమూర్తి తెలిపారు. కాబట్టి ఈ గడువును పెంచలేమని చెప్పారు.