Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ ముందుకు16 కొత్త బిల్లులు, మూడు పాతవి
- శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచన
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అటవీ సంరక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లోక్‌సభ బులిటన్ విడుదల చేసింది. అందులో మొత్తం 19 బిల్లులు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 16 కొత్త బిల్లులు, మూడు పాత బిల్లులు ఉన్నాయి. అటవీ సంరక్షణ సవరణ బిల్లు-2022, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఓల్డ్ గ్రాంట్ రెగ్యులేషన్ బిల్లు, కంటోన్మెంట్ బిల్లు, నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లులతో సహా వివిధ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ప్రవేశపెట్టిన మూడు బిల్లలు పార్లమెంట్ స్టాండిగ్ కమిటీ, జాయింట్ కమిటీలకు పంపనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరగనున్నాయి. పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహలపై అన్ని పార్టీలు చర్చలు జరుపుతున్నాయి.