Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీలే లక్ష్యంగా 2022-23లో జరగొచ్చు : అమెరికా పరిశోధన సంస్థ నివేదిక
- ముస్లింలపై బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు..
- ఇలాంటి ప్రసంగాల వల్లే 2020 ఢిల్లీ అల్లర్లు..
- సామూహిక హత్యలు జరిగే ప్రమాదమున్న దేశాల్లో భారత్‌కు 8వ స్థానం
న్యూఢిల్లీ : భారత్‌లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున మారణహోమం జరగొచ్చునని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ విడుదల చేసిన 'ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్' నివేదిక అంచనావేసింది. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో సామూహిక మారణ హోమాలు జరిగే ప్రమాదముందో తెలియజేస్తూ ర్యాంకులు విడుదల చేసింది. ఈనేపథ్యంలో భారత్ 8వ స్థానంలో ఉందని తెలిపింది. ''2022-23లో ఒక జాతిని, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భారత్‌లో హత్యాకాండ జరిగే అవకాశముంది. మొత్తంగా 14 ఘటనల్లో మారణహోమం తలెత్తే అవకాశం ఒక్క ఘటనలో ఉంది. ఘటన జరిగే అవకాశం 7.4శాత''మని తాజాగా విడుదలైన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సైమన్-స్కోట్ సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ జినోసైడ్ (అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ) ఈ నివేదికను రూపొందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సొమాలియా కన్నా డేంజర్
సామూహిక హత్యలు జరిగే ప్రమాదముందని, ఆ అవకాశముందని నివేదిక అంచనావేస్తోంది. మొత్తం 162 దేశాలకు సంబంధించి జాబితా విడుదలకాగా, ఇందులో పాకిస్తాన్ మొదటిస్థానంలో, యెమెన్ రెండోస్థానంలో, మయన్మార్ మూడో స్థానంలో, ఇథియోపియో ఐదో స్థానంలో, నైజీరియా ఆరోస్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ ఏడో స్థానంలో నిలిచాయని నివేదిక పేర్కొంది. జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కగా, సూడాన్ (9), సొమాలియా (10), సిరియా (10), ఇరాక్ (12), జింబాబ్వే (14) కంటే భారత్ పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉంది. 2021-22 నివేదిక ప్రకారం గత ఐదేండ్లలో అత్యధిక ప్రమాదమున్న టాప్-15 దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.
ముస్లింలే లక్ష్యం..
దేశంలో ముస్లిం మైనార్టీలు లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను నివేదిక ప్రస్తావిం చింది. అనేక ఉదాహరణలను చూపుతూ నివేదికలో హైలైట్ చేసింది. ''డిసెంబర్ 2021లో ముస్లింపై సామూహిక హత్యలకు దిగాలని హిందూత్వ శక్తులు పిలుపునివ్వటం, ద్వేషపూరిత ప్రచారం చేయటం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హిందూత్వ శక్తుల ఊరేగింపుల్లో దాడులు జరుగుతున్నాయి. మసీదులకు సమీపంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ముస్లింలు యాజమాన్యా లుగా ఉన్న ఆస్తులను బుల్డౌజర్లతో కూల గొడుతు న్నారు'' అని నివేదిక పలు ఉదాహరణలు తెలిపింది.
అడ్డుకోవటం లేదు..
గతకొన్ని సంవత్సరాలుగా బీజేపీతో సంబంధమున్న, ఆ పార్టీ మద్దతుదారులైన నాయ కులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడాలని పిలుపు నిస్తున్నారు. అయినా వారిపై కేంద్రంలోని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 2020లో ఇలాగే హిందూత్వ నాయకుడు యతి నర్సింహానంద ప్రసంగాలతో ఢిల్లీ అల్లర్లు చెలరేగాయి. 53మంది అమాయక పౌరులు మరణించారు. సీఏఏ నిరసనల్ని దెబ్బతీయడానికి బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా అనేకమందిని రెచ్చగొట్టి అల్లర్లకు కారణమ య్యాడు. ఇప్పటివరకూ అతడిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కాషాయ మూకలు మరింత రెచ్చిపోతున్నాయని నివేదిక తెలిపింది.