Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ అల్లర్ల కేసులో అదనపు సెషన్స్ కోర్టు
న్యూఢిల్లీ : 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌ను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు శనివారం కర్కర్దూమా అదనపు సెషన్స్ జడ్జి ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ 101/2020పై ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ పాండే ధ్రువీకరించారు. ఉమర్ ఖలీద్‌తో పాటు యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ సభ్యుడు ఖలీద్ సైఫీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలోని చాంద్‌బాగ్ పులియాలో పెద్ద సంఖ్యలో గుంపు గుమిగూడి రాళ్లు రువ్వారని కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తి నష్టం నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25, 27తో పాటు ఐపీసీ సెక్షన్ 109, 114, 147, 148, 149, 153-ఏ, 186, 212, 353, 395, 427, 435, 436, 452, 454, 505, 34, 120-బీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 28న కేసు క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ అయింది. ఈ గుంపులో ఉమర్ ఖలీద్ భాగం కానప్పటికీ ఆయన, ఖలీద్ సైఫీలపై నేరపూరిత కుట్ర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉమర్ ఖలీద్, సైఫీలకు బెయిల్ మంజూరు చేస్తూ వారిని జైలులో ఉంచడానికి అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందనీ, ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేశామని పేర్కొంది. కానీ ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తూ తీవ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కేసులో వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఉమర్ ఖలీద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి అక్టోబర్ 18న ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.