Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇ అండ్ వై నిపుణులను కోరిన దర్యాప్తు అధికారులు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో గత నెల 23న జరిగిన సైబర్ దాడి విషయంలో భద్రతా సంస్థలు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఇఅండ్‌వై) కన్సల్టెన్సీ సంస్థ సాయాన్ని కోరాయి. ఈ సైబర్ దాడితో ఆస్పత్రిలోని సర్వర్లు, ఇ-ఆస్పత్రి సేవలు స్తంభించిపోయాయి. దీంతో రోగులకు తీవ్రంగా ఇబ్బంది కలిగింది. ఈ ఏడాది మధ్య భాగంలో తమ ఆస్పత్రి సైబర్ వ్యవస్థలపై ఆడిట్ నిర్వహించాల్సిందిగా థర్డ్ పార్టీ ఇ అండ్ వైని ఎయిమ్స్ కోరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వ్యవస్థలో ఏమైనా లోపాలు వున్నాయని ఆడిటర్లు కనుగొన్నట్లైతే వాటిని పరిశీలించేందుకు దర్యాప్తులో సాయపడాల్సిందిగా కోరుతూ గత వారం లా ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ సంస్థ ఇ అండ్ వై ఎగ్జిక్యూటివ్‌లను కోరింది. పొరుగు దేశానికి చెందిన వారి ఆదేశాల మేరకే రెండు మాసాల క్రితమే ఎయిమ్స్ సర్వర్లపై దాడి మొదలైంది దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.