Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న ప్రధానోపాధ్యాయు రాలిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని.. ఈరోడ్ మహిళా కోర్టులో హాజరుపరిచి, జైలుకి తరలించినట్టు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమెపై బాలల హక్కులు, రక్షణ చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టం, ప్రమాదకర రసాయనాల అసురక్షిత వినియోగం సహా 4 సెక్షన్ల కింద పెరుందురై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని అన్నారు.తమిళనాడులోని పాలక్కరై పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేయా లంటూ హెడ్‌మాస్టర్ షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) విద్యార్థులను ఆదేశించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు అనారోగ్యం బారిన పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆమె పరారయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతారాణి పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులను ఏడాదిగా పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణలో తేలింది. దీంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు.