Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవాడలో పౌరసన్మానం.. విశాఖలో నేవీ విన్యాసాల వీక్షణ
అమరావతి: రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత దౌపది ముర్ము ఆదివారం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విజయవాడలో పౌరసన్మానం నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళ లందరికీ రాష్ట్రపతి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతి దేశమంతా వ్యాపించిందన్నారు. మహాకవి గురజాడను, ఆయన రచించిన కన్యాశుల్కాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్ తదితరుల బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నుండి విశాఖకు వెళ్లారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆర్కేబీచ్లో నౌకాదళ విన్యాసాలకు ముఖ్య అతిధిగా హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి నౌకాదళం త్రివర్ణ బాంబర్లతో స్వాగతం పలికింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ నౌకాదళ గీతం ఆలపించారు. నౌకదళ విన్యాసాలను తిలకించ డానికి భారీ సంఖ్యలో ప్రజానీకం తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి తిరుపతికి వెళ్లారు.