Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : రబీ సీజన్ కాలంలో అవసరమైనంత డిఎపి (డై అమ్మోనియం ఫాస్పేట్) సరఫరా చేయకపోవడంపై బుందేల్‌ఖండ్ కిసాన్ యూనియన్‌కి చెందిన రైతులు నిరసన తెలిపారు. మహౌబా, బందా, చిత్రకూట్ల్లో రైతులు కిసాన్ సమృద్ధి పాదయాత్ర చేపట్టారు. డిఎపి కోసం బుందేల్‌ఖండ్ ప్రాంతంలో రైతులు పెద్ద పెద్ద క్యూల్లో వేచి వుండాల్సి వస్తోంది. ఏడు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ ప్రదర్శనలో ఎడ్ల బండ్లతో రైతులు పాల్గొన్నారు. ఎరువుల సరఫరా సరిగా లేకపోవడంతో మహౌబా, బందాల్లో రైతులు ప్రధాన రహదారిని దిగ్బంధించి నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ఈ దిగ్బంధనం కొనసాగింది. జిల్లా యంత్రాంగం హామీ ఇవ్వడంతో రైతులు దిగ్బంధనాన్ని విరమించారు. తమ డిమాండ్లను వివరిస్తూ ఎస్డిఎంకి రైతులు మెమోరాండం సమర్పిం చారు. కల్తీ ఎరువుల సరఫరాలో అధికారుల ప్రమేయం వుందని వారు విమర్శించారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత త్వరలో డిఎపి సరఫరాను పునరుద్ధరించకపోతే నిరసన ఇలాగే కొనసాగుతుందని బుందేల్ ఖండ్ కిసాన్ యూనియన్ అధ్యక్షులు విమల్ శర్మ మీడియాకు తెలిపారు.