Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వ సంస్థల ప్రచారం
న్యూఢిల్లీ : ఇటీవల ఓ హిందూ సేన నేత కత్తులను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియోలో ఆయన కత్తులను ప్రదర్శిస్తూ.. వాటిని విక్రయించనున్నామనీ, ఉచితంగా డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. వాటికి లైసెన్స్ ఉందనీ, ఒక్కో దాని ధర రూ.1,250గా వివరిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. వాటికి 30 ఏండ్ల గ్యారంటీ ఉందని పేర్కొంటూ బహిరంగంగా పోస్ట్ చేశారు. పైగా కత్తుల విక్రయానికి ప్రధాన మంత్రి, హోం మంత్రి కార్యాలయం అనుమతులు కూడా ఉన్నాయని పేర్కొంటూ కాంటాక్ట్ నెంబర్‌ను ఇచ్చారు.
ఆయుధాల చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం... ఆయుధాలను విక్రయించడం నేరం. ఒకవేళ లైసెన్స్ లేకుండా వాటిని కలిగి ఉంటే ఏడేండ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 20 ప్రకారం.. ఒక పోలీస్ అధికారి లేదా మరేదైనా ప్రభుత్వోద్యోగి లేదా రైల్వే, విమానం, ఓడ తదితర సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయుధాలను రవాణా చేస్తుంటే వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. సెక్షన్ 22 ప్రకారం.. జిల్లా మెజిస్ట్రేట్‌కు స్థానిక పరిమితుల్లో నివసించే వ్యక్తి ఏదైనా చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం ఆయుధాలు లేదా మందుగుండు సామాగ్రిని కలిగి ఉంటే ఆ వ్యక్తి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. సెక్షన్ 25(3) ప్రకారం... స్థానిక పోలీస్ అధికారి లేదా జిల్లా మెజిస్ట్రేట్‌కి సమాచారమివ్వ కుండా ఆయుధాలను విక్రయించడం, పంపిణీ చేయడం శిక్షార్హం. కనీసం ఆరు నెలల శిక్ష విధించే అవకాశం ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన ఊరేగింపుల్లో హిందూత్వ కార్యకర్తలు హింసాకాండకు దిగిన సందర్భాల్లో ఇటువంటి కత్తులను మారణాయుధాలను వినియోగించడాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని జహంగీర్‌పురి హింసాకాండలో కొందరు వ్యక్తులు కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలను చూపుతూ కనిపించిన సంగతి తెలిసిందే. 2016 చట్టంలోని రూల్ 8 ప్రకారం.. లైసెన్స్ కలిగిన ఆయుధాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం, వేడుకలు, బహిరంగ సమావేశాల్లో వినియోగించడం కూడా శిక్షార్హమే. కరుడుగట్టిన హిందూత్వ వాదులు కత్తులతో వీరంగం సష్టించడం ఇదే మొదటిసారికాదు. కర్నాటకలోని బెల్గావిలో దసరా వేడుకల సందర్భంగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు కత్తులను ప్రదర్శించారు. అలాగే మంగళూరు జిల్లాలోని అతివాద హిందూత్వ గ్రూపులు దసరా సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ స్థానిక కార్యాలయంలో 'ఆయుధ పూజ' నిర్వహించారు. త్రిశూలాన్ని ధరించి హిందువులను లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, గోహత్యల నుండి కాపాడతామంటూ ప్రతిజ్ఞ చేసినట్టు ముస్లిం మిర్రర్ నివేదించింది. ఏప్రిల్‌లో అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ గుజరాత్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్కడ వేలాది కత్తులను, త్రిశూలాలను ప్రజలకు పంపిణీ చేశారు. 5100 మందితో హిందూ మతాన్ని రక్షిస్తామని వాగ్దానం చేయించారు.
గతేడాది నవంబర్‌లో హిందూత్వ కార్యకర్తలకు ఓ నేత రాజీవ్ బ్రహ్మర్షి కత్తులను పంపిణీ చేసినట్టు నివేదించింది. అతను తన ఫేస్బుక్లో హిందుస్థాన్‌లో ప్రతి ప్రాంతానికి ఆయుధాలు చేరుకుంటాయి అని ప్రకటించాడు. అతడిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజానికి చెందిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ జార్ఖండ్‌లోని హిర్హి గ్రామాన్ని సందర్శించింది. రామనవమి సమయంలో ఆ గ్రామంలో ఊరేగింపులో కత్తులను ప్రదర్శిస్తూ.. అమాయకు లపై దాడి చేశారని నిర్థారించింది. ఈ దాడిలో ముజాహిమ్ అన్సారీ (70)కి తీవ్ర గాయాలవగా, మొబారక్ అన్సారీ (45) మరణించాడు.